Do You Know about Rajamouli First Salary
Rajamouli : తెలుగు సినిమాని పాన్ ఇండియాకు, హాలీవుడ్ కి తీసుకెళ్లి ఆస్కార్ కూడా సాధించిన లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి. భారీ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి రెమ్యునరేషన్ సినిమాకు దాదాపు 50 కోట్లపైనే ఉంటుందని, అలాగే ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుంటారని టాలీవుడ్ టాక్.
ఇప్పుడు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి మొదటి సంపాదన ఎంతో తెలుసా? తాజాగా రాజమౌళి ఈ విషయాన్ని తెలిపారు. నాగార్జున – ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జూన్ 15 రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : Kuberaa Trailer : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ ట్రైలర్ వచ్చేసింది..
ఈ ఈవెంట్లో యాంకర్ సుమ సరదాగా పలు ప్రశ్నలు అడుగుతూ రాజమౌళిని మీ మొదటి సంపాదన ఎంత అని అడిగారు. దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. అసిస్టెంట్ ఎడిటర్ గా చేశాను. అప్పుడు 50 రూపాయలు ఇచ్చారు అని తెలిపారు. రాజమౌళి దర్శకుడు అవ్వకముందు డైరెక్షన్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసిన సంగతి తెలిసిందే.