Gayatri Joshi
Gayatri Joshi : హీరోయిన్స్ కి ఒక సినిమా హిట్ అయితే చాలు వరుస ఆఫర్స్, మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్స్, యాడ్స్ తో బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక హీరోయిన్స్ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేసేస్, బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టి డబ్బులు చేసుకుంటారు. కానీ ఈ హీరోయిన్ వాళ్లందరికీ డిఫరెంట్.(Gayatri Joshi)
ఈ హీరోయిన్ చేసింది ఒక్క సినిమా మాత్రమే. ఆ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా షారుఖ్ ఖాన్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన స్వదేశ్ సినిమాలో నటించిన గ్రాయత్రి జోషి.
Also Read : Annagaru Vostaru : ‘అన్నగారు వస్తారు’ అంటున్న కార్తీ.. టీజర్ వచ్చేసింది..
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన గాయత్రీ జోషి ఆ తర్వాత మోడల్ గా మారింది. పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. అనేక యాడ్స్ లో నటించింది. 2004 లో షారుఖ్ ఖాన్ సరసన స్వదేశ్ సినిమాలో హీరోయిన్ గా మంచి పాత్రలో నటించింది గాయత్రీ జోషి.
ఈ సినిమా చూసిన వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ కి గాయత్రీ తెగ నచ్చేసింది. ఇంకేముంది తన పరిచయాలు వాడి గాయత్రిని కలిసి మాట్లాడి ప్రేమలో పడేసాడు. 2004 లో ఒకే ఒక్క సినిమా స్వదేశ్ చేసి గాయత్రీ వెంటనే 2005 లో వికాస్ ఒబెరాయ్ ని పెళ్లి చేసేసుకుంది. అక్కడితో సినిమా కెరీర్ కి ముగింపు పలికింది.
Also See : Sobhita Dhulipala : స్టైలిష్ లుక్స్ తో.. వైరల్ అవుతున్న శోభిత ధూళిపాళ..
వికాస్ ఒబెరాయ్ తండ్రి మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. వికాస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో చదివి తండ్రి బిజినెస్ ని తీసుకున్నాడు. ముంబై లో ఖరీదైన ఇల్లు, ప్లాట్స్ కట్టడంతో వికాస్ ఒబెరాయ్ కంపెనీ స్పెషల్. రియల్ ఎస్టేట్ రంగంలో వికాస్ ఒబెరాయ్ పెళ్లి తర్వాత బాగా ఎదిగాడు. వికాస్ ని పెళ్లి చేసుకున్నాక గాయత్రీ కూడా భర్తతో కలిసి బిజినెస్ చూసుకుంటుంది.
గాయత్రీ జోషి – వికాస్ ఒబెరాయ్ ఇద్దరూ కలిసి 20 ఏళ్ళు కస్టపడి వీరి బిజినెస్ ఒబెరాయ్ రియాలిటీని పెద్ద కంపెనీగా మార్చారు. 2004 లెక్కల ప్రకారం గాయత్రీ – వికాస్ కు ఉమ్మడిగా 60 వేల కోట్ల ఆస్తి ఉన్నట్టు సమాచారం. వికాస్ గత సంవత్సరం టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరిగా ఫోర్బ్స్ ఇండియా లిస్ట్ లో నిలిచాడు.
వికాస్ గాయత్రీని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా కలిసి వచ్చింది అని చెప్తాడు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలా ఒక్క సినిమా చేసి కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకొని బిజినెస్ తో సామ్రాజ్యం సృష్టించుకొని 60వేల కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించింది గాయత్రి జోషి.