Akanksha Sharma : విశ్వక్ ‘లైలా’ సినిమా హీరోయిన్.. అయిదేళ్ల క్రితమే మహేష్ బాబుతో నటించిందని తెలుసా? మహేష్ గురించి ఏం చెప్పిందంటే..

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ లో ఆకాంక్ష తన అందాలతో అలరించి ఒక్కసారిగా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది.

Do You Know about Vishwak Sen Laila Movie Actress Akanksha Sharma She Worked with Mahesh Babu

Akanksha Sharma : విశ్వక్ సేన్ ఫిబ్రవరి 14న లైలా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో నటించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఆకాంక్షకు హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా. తెలుగులోనే ఆకాంక్ష లైలా సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ లో ఆకాంక్ష తన అందాలతో అలరించి ఒక్కసారిగా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది.

లైలా సినిమాలో ఆకాంక్ష శర్మ ఓ పాటలో బికినీ కూడా వేసి అదరగొట్టింది. దీంతో ఈ కొత్త అమ్మాయి ఎవరు అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. అయితే ఆకాంక్ష శర్మ గతంలోనే మహేష్ బాబుతో నటించింది అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆకాంక్ష శర్మ ఒక మోడల్. చదువుకునేటప్పటి నుంచే మోడల్ గా పలు యాడ్స్ చేస్తూ, ర్యాంప్ వాక్స్ చేస్తూ బిజీ అయింది. సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ తెచ్చుకుంది. పలు మ్యూజిక్ వీడియోలు, పలు సిరీస్ లలో కూడా నటించింది ఆకాంక్ష శర్మ.

Also Read : Vishwak Sen : మూడు నెలలు తిప్పించుకున్నారు.. రెండు రోజులు ఏడ్చాను.. నాకే ఎందుకు ఇలా.. విశ్వక్ కెరీర్ స్టార్టింగ్ కష్టాలు..

గతంలో ఆకాంక్ష సంతూర్ యాడ్ లో నటించింది. తెలుగులో మహేష్ బాబు గతంలో సంతూర్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అయిదేళ్ల క్రితం మహేష్ బాబు చేసిన సంతూర్ యాడ్ లో ఆకాంక్ష శర్మ నటించింది. సంతూర్ యాడ్ లో ఒక పాప మమ్మీ అనుకుంటూ వస్తుంది కదా.. ఆ మమ్మీ అని పిలిచేది ఆకాంక్ష శర్మనే. అయిదేళ్ల క్రితమే ఈ అందాల భామ మోడల్ గా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన యాడ్ లో మెయిన్ లీడ్ గా నటించింది.

https://www.youtube.com/watch?v=JUoXHTwHiII

తాజాగా లైలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో చేసిన యాడ్ గురించి ప్రస్తావిస్తూ మహేష్ గురించి మాట్లాడింది. ఆకాంక్ష శర్మ మాట్లాడుతూ.. ఆ యాడ్ చేయడం నా లక్కీ. మహేష్ గారితో షూట్ చేస్తున్నప్పుడు ఆయన సెట్ లోకి అడుగుపెట్టగానే చుట్టూ ఓ కొత్త వాతావరణం కనిపించింది. అది ఆయన స్టార్ డమ్ అని నాకు అర్ధమయింది. ఆ యాడ్ తర్వాతే నన్ను అందరూ గుర్తు పట్టడం మొదలుపెట్టారు. అందులో మమ్మీ అని పిలిచినా ఆయన నన్ను చిన్న పిల్లలా ఉందని అన్నారు అంటూ తెలిపింది.

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ బాడీ గార్డ్ గురించి తెలుసా? 7 అడుగులు ఎత్తు.. అతన్ని దాటి విశ్వక్ ని టచ్ చేయలేరు.. జీతం ఎంతో తెలుసా?

అలా ఆకాంక్ష శర్మ అయిదేళ్ల క్రితమే మహేష్ బాబుతో సంతూర్ యాడ్ చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా లైలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో అలరిస్తుంది. మరి లైలా తర్వాత తెలుగులో ఈ భామ హీరోయిన్ గా బిజీ అవుతుందేమో చూడాలి.