Aditya Dhar
Aditya Dhar : బాలీవుడ్ లో ఇటీవల రిలీజయిన స్పై థ్రిల్లర్ సినిమా ‘దురంధర్’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 700 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పాకిస్థాన్ కి వెళ్లి అక్కడ పనిచేసిన ఓ ఏజెంట్ కథతో, రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్థాన్ – భారత్ కి చెందిన కొన్ని సంఘటనల నేపథ్యంలో దురంధర్ సినిమాని తెరకెక్కించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, మాధవన్.. కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.(Aditya Dhar)
ధురంధర్ సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి వైరల్ గా మారాడు. దీంతో బాలీవుడ్ ని ఊపేస్తున్న ఈ డైరెక్టర్ ఎవరా అని చర్చిస్తున్నారు. ఆదిత్య ధర్ ఒక కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన వాడు. లిరిక్ రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆదిత్య ధర్ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన అన్నతో కలిసి నిర్మాతగా మారాడు.
దర్శకుడిగా మారి ‘ఉరి’ సినిమాని తెరకెక్కించాడు. పాకిస్థాన్ పై భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించి మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించాడు. ఈ సినిమాతో ఏకంగా నాలుగు నేషనల్ అవార్డులతో పాటు మరిన్ని ప్రైవేట్ అవార్డులు గెలుచుకున్నాడు. 2019 లో ఉరి సినిమా తీసిన ఆదిత్య ధర్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ధురంధర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా జాతీయభావంతో రియల్ గా జరిగిన సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు. ధురంధర్ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించారు. ధురంధర్ పార్ట్ 2 సినిమా 2026 లో రిలీజ్ కానుంది.
ఇక ఆదిత్య ధర్ హీరోయిన్ యామి గౌతమ్ ని 2021లో పెళ్లి చేసుకున్నాడు. ఉరి సినిమా సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడి సింపుల్ గా పెళ్ళి చేసుకున్నారు. ఈ జంటకు ఒక బాబు ఉన్నాడు. ఆదిత్య ధర్ భార్య యామి గౌతమ్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. యామి గౌతమ్ కెరీర్ ఆరంభంలో తెలుగులో నువ్విలా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంది.
Also See : Mahesh Babu Family : ముగ్గురు అక్కచెల్లెళ్ళతో మహేష్ బాబు.. ఫ్యామిలీతో లేటెస్ట్ ఫోటోలు వైరల్..