Srinu Vaitla
Srinu Vaitla : కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఒకప్పుడు ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు.. ఇలా ఎన్నో సూపర్ హిట్స్ కొట్టిన శ్రీనువైట్ల గత కొంతకాలంగా మాత్రం ఫ్లాప్స్ లో ఉన్నారు. శ్రీను వైట్ల మొదటి సినిమా నీ కోసం అని అందరికి తెలిసిందే. రవితేజ, మహేశ్వరి జంటగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా 1999లో వచ్చింది.
Also Read : Alekhya : కుంకుమ పెట్టుకోవద్దు అన్నారు.. వెళ్లకూడదని డిసైడ్ అయ్యా.. తారకరత్న చనిపోయాక అలేఖ్య ఇబ్బందులు..
అయితే అందరూ అనుకున్నట్టు నీకోసం శ్రీనువైట్ల మొదటి సినిమా కాదు. దీనికంటే ముందే శ్రీనువైట్ల హీరో రాజశేఖర్ తో ఓ సినిమా మొదలుపెట్టారు. 1997లోనే రాజశేఖర్ హీరోగా సాక్షి శివానంద్, మహేశ్వరి హీరోయిన్స్ గా సినిమా మొదలుపెట్టారు. దీనికి అపరిచితుడు అనే టైటిల్ పెట్టారు.
కానీ కొంత భాగం షూటింగ్ అయిపోయిన తర్వాత పలు కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో పాటలు కూడా రికార్డు చేశారు కానీ అవి కూడా రిలీజ్ అవ్వలేదు. ఒకటి రెండు పోస్టర్స్ మాత్రం రిలీజ్ చేసారు. ఆలా మొత్తానికి శ్రీనువైట్ల ఫస్ట్ సినిమా రాజశేఖర్ తో మొదలయి ఆగిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకు రవితేజతో నీకోసం సినిమా చేసారు.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. కాలర్ ఏ ఎత్తరా సాంగ్ ప్రోమో వచ్చేసింది..