Do you know how many days Rashmika Mandanna worked for allu arjun pushpa 2 movie
Rashmika Mandanna : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2. పుష్ప 1 భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్ తో పాటు నిర్మాతలు కూడా వచ్చారు. కాగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న మైత్రి ప్రొడ్యూసర్ రవి శంకర్.. పుష్ప సినిమాతో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ రష్మిక మందన్న ఈ సినిమా కోసం చాలా కష్ట పడిందని, ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చిందని అన్నారు. అంతేకాదు పుష్ప 2 కోసం ఏకంగా 170 రోజులు షూటింగ్ లో పాల్గొందని’ తెలిపారు.
Also Read : Nagarjuna Akkineni : నాగచైతన్య పెళ్లికి ముందు ఖరీదైన కార్ కొన్న నాగ్.. ఎన్ని కోట్లో తెలుసా..
ఇక ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ కేవలం రష్మిక మాత్రమే 170 రోజులు పుష్ప 2 కోసం పని చేశారా అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఒక సినిమా షూటింగ్ మొత్తం 70 నుండి 100 రోజులు ఉంటుంది. ఆ సమయంలోపే సినిమా పూర్తిచేస్తారు. కానీ ఈ సినిమా కోసం కేవలం రష్మిక మందన్న మాత్రమే 170 రోజులు తన డేట్స్ ఇచ్చిందట. మరి రష్మికనే ఇన్ని రోజుల డేట్స్ ఇచ్చిందంటే అల్లు అర్జున్ ఇంకెన్ని రోజుల డేట్స్ ఇచ్చాడన్నది అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఒక స్టార్ హీరోయిన్ ఇన్ని రోజుల డేట్స్ కేవలం ఒక్క సినిమాకే ఇచ్చిందంటే గ్రేట్ అని చెప్పొచ్చు.
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.