Ranveer Singh
Ranveer Singh : అటు సినిమాలు.. ఇటు యాడ్స్‌తో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక యాడ్‌కి ఈ నటుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే షాకవుతారు.
Rakul Preet Singh : పెళ్లి పనులు మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్
రణ్‌వీర్ సింగ్ మంచి నటుడుగానే పేరు సంపాదించుకోవడమే కాదు.. అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలతో ఓ రేంజ్‌లో సంపాదిస్తున్నారు. రూ.360 కోట్లకు పైగానే నికర ఆస్తులు ఉన్న రణ్‌వీర్ ఒక ప్రకటన కోసం రూ.3.5 నుండి రూ.4 కోట్ల మధ్య రెమ్యునరేషన్ వసూలు చేస్తారట. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా రణ్‌వీర్ ఉండటం విశేషం. 2022 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) రణ్‌వీర్‌ను ‘బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది. రణ్‌వీర్ చింగ్స్ నుండి బింగో వరకు.. నివియా నుండి కోల్ గేట్ వరకు వివిధ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నారు. యాడ్స్ ప్రపంచంలో రణ్‌వీర్ ప్రత్యేకమైన స్ధానం సంపాదించుకున్నారు.
Game Changer : మళ్లీ వాయిదా పడ్డ ‘గేమ్ ఛేంజర్’..?
రణ్‌వీర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవ్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘సింగం ఎగైన్’ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ మూవీలో కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు.