Rakul Preet Singh : పెళ్లి పనులు మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఎకో ఫ్రెండ్లీగా వీరి వివాహ వేడుకలు జరగబోతున్నాయట.

Rakul Preet Singh : పెళ్లి పనులు మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh

Updated On : February 17, 2024 / 1:01 PM IST

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఫిబ్రవరి 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ జంట పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. గురువారం రాత్రి ముంబయిలో జాకీ భగ్నాని ఇంట్లో జరిగిన వేడుకకు రకుల్ ఫ్యామిలీ తరలివచ్చారు. జాకీ ఇల్లు లైటింగ్‌తో వెలిగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun : బెర్లిన్‌లో ఐకానిక్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ ఫొటోలు..

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఫిబ్రవరి 1న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 1న పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 12న ప్రధాన వేడుక జరుగుతుంది. వీరి పెళ్లి ఎకో ఫ్రెండ్లీగా జరగబోతోందట. పేపర్ వేస్ట్ చేయకూడదని ఇప్పటికే ఆహ్వానాలను డిజిటల్‌గా పంపారట. వీరి పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెద్దగా వివరాలు ఏమీ లేకుండా జస్ట్ బీచ్ థీమ్‌తో వారి పెళ్లి కార్డును డిజైన్ చేసారు. వీరి వివాహం కూడా సింపుల్‌గా జరగబోతోందట. వివాహ సమయంలో టపాసులు కాల్చడం వంటివి చేయకూడదని నిర్ణయించుకున్నారట. పెళ్లిలో ఎక్కడ పేపర్ వ్యర్థాలు ఉండకూడదని.. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు కలిసి మొక్కలు నాటాలని డిసైడ్ అయ్యారట. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.

Game Changer : మళ్లీ వాయిదా పడ్డ ‘గేమ్ ఛేంజర్’..?

ఇక రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. గురువారం రాత్రి జాకీ భగ్నానీ ఇంట్లో జరిగిన వేడుకకు రకుల్ కుటుంబం తరలి వచ్చింది. జాకీ భగ్నానీ ఇల్లు లైటింగ్ తో వెలిగిపోయింది. ఈ వేడుక తర్వాత రకుల్, జాకీ భగ్నానీ తమ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకున్నారు. రకుల్ జాకీలు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రకుల్ నటించిన ‘అయలాన్’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani)