Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఏమేం సినిమాలు తీశారో తెలుసా?

మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈయనకు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో గతంలో నాలుగు సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు.

Do You Know Jubilee Hills MLA Maganti Gopinath Movies as Producer

Maganti Gopinath : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) నేడు ఉదయం కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ నేడు ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈయనకు సినీ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉండటంతో గతంలో నాలుగు సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు.

Also Read : మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల కేసీఆర్, రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం

మాగంటి గోపినాథ్.. శ్రీ సాయినాధ్ ఆర్ట్ క్రియెషన్స్ బ్యానర్ పై సురేష్, శ్రీకాంత్, నాగబాబు కీలక పాత్రల్లో 1995 లో పాతబస్తీ అనే సినిమాని నిర్మించారు. అనంతరం రాజశేఖర్, కృష్ణ లతో RK ఫిలిమ్స్ బ్యానర్ పై 2000 సంవత్సరంలో రవన్న అనే సినిమాని నిర్మించారు. అనంతరం 2004 లో దివ్య అక్షర నాగ మూవీ బ్యానర్ పై తారకరత్నతో భద్రాద్రి రాముడు అనే సినిమాని నిర్మించారు. 2009 లో రాజశేఖర్ తో దిశిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నా స్టైలే వేరు అనే సినిమాని నిర్మించారు. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా ఆశించినంత విజయం సాధించలేదు.

Also Read : Nayani Pavani : నాన్న క్యాన్సర్ తో చనిపోయారు.. అదే సమయంలో బ్రేకప్.. నయని పావని ఎమోషనల్..