RP Patnaik : వామ్మో ఆర్పీ పట్నాయక్ ఇంత చదువుకున్నారా.. అబ్దుల్ కలాం దగ్గర ఉండాల్సింది..

ఆర్పీ పట్నాయక్ చాలా చదువుకున్నారట.

RP Patnaik : వామ్మో ఆర్పీ పట్నాయక్ ఇంత చదువుకున్నారా.. అబ్దుల్ కలాం దగ్గర ఉండాల్సింది..

Do you know the Music Director RP Patnaik Study Details Here

Updated On : November 6, 2024 / 3:32 PM IST

RP Patnaik : సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురించి అందరికి తెలిసిందే. 2000 సంవత్సరం నుంచి ఓ పదేళ్లు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం, అదిరిపోయే పాటలు ఇచ్చారు. అలాగే నటుడిగా, దర్శకుడిగా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు. అప్పట్లో ఆయన చేసిన ప్రతి పాట హిట్ అయ్యింది. కానీ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తునారు ఆర్పీ పట్నాయక్.

అయితే ఆర్పీ పట్నాయక్ చాలా చదువుకున్నారట. అసలు సంగీతం బ్యాక్ గ్రౌండ్, యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇంత సాధించారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ తన చదువు గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Kanguva : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే..

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. నేను ఆంధ్ర యూనివర్సిటీలో MSc స్పేస్ ఫిజిక్స్ చేశాను. అది కంటిన్యూ చేసి ఉంటే సైంటిస్ట్ అయ్యేవాడ్ని. అబ్దుల్ కలాం దగ్గరో, ఇస్రోలోనో ఉండేవాడిని. కానీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పటిదాకా చదివింది ఒక ఎత్తైతే సివిల్స్ కోసం ఆ రెండేళ్లు చదివింది ఒక ఎత్తు. అప్పటిదాకా సైన్స్ మాత్రమే చదివాను. సివిల్స్ లో అన్ని చదివాను. అప్పుడే ప్రపంచాన్ని అర్ధం చేసుకున్నాను. దాంతో నా ఆలోచనలు మారిపోయాయి అని అన్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ వైపు దృష్టి సారించి ఈ రంగంలో సక్సెస్ అయ్యారు.