×
Ad

Priyanka Chopra : వామ్మో.. వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా? ఇక భర్తతో కలిపి ఏకంగా..

ప్రియాంకచోప్రా ఒక్కో హాలీవుడ్ సినిమాకు 40 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందట.(Priyanka Chopra)

Priyanka Chopra

Priyanka Chopra : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంకచోప్రా ఆ తర్వాత హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని ఒక పాపతో ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రియాంక హాలీవుడ్ కి వెళ్లడం, మరింత స్టార్ డమ్ రావడంతో బాగానే సంపాదిస్తుంది. తాజాగా ఓ హాలీవుడ్ మీడియా ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ ఆస్తుల విలువని ప్రకటించారు.(Priyanka Chopra)

ప్రియాంకచోప్రా ఒక్కో హాలీవుడ్ సినిమాకు 40 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇటీవల వచ్చిన సిటాడెల్ సినిమాకు 41 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సరసన వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రియాంక 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని టాలీవుడ్ టాక్.

Anudeep : స్కూల్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా.. నా జీవితంలో పెళ్లి లేదు.. అనుదీప్ లవ్ స్టోరీ తెలుసా?

మరో పక్క యాడ్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తుంది ప్రియాంక. ఒక్కో యాడ్ కు ప్రియాంక చోప్రా దాదాపు 6 నుంచి 10 కోట్లు తీసుకుంటుందట. తాజా లెక్కల ప్రకారం ప్రియాంకచోప్రా ఆస్తుల విలువ దాదాపు 583 కోట్లు. ఇక ప్రియాంక భర్త నిక్ జోనస్ హాలీవుడ్ లో స్టార్ సింగర్ అని తెలిసిందే. అతను బయట నిర్వహించే ఈవెంట్స్ కి భారీగా వసూలు చేస్తాడు. నిక్ జోనస్ ఆస్తుల విలువ దాదాపు 666 కోట్లు అని సమాచారం.

ఇలా ప్రియాంక – నిక్ జోనస్ భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి ఆల్మోస్ట్ 1250 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారట. అమెరికాలో ఈ జంట రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టారట. కొన్నాళ్ల క్రితం ఈ జంట 20 మిలియన్ డాలర్స్ అంటే దాదాపు 183 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన ఇంటిని లాస్ ఏంజిల్స్ లో కొన్నారు. ఈ భవనం విలువ ఇప్పుడు ఇంకా పెరిగిందట.

Also See : Funky Interview : విశ్వక్, కయదు లోహర్ ‘ఫంకీ’ స్పెషల్ ఇంటర్వ్యూ.. డైరెక్టర్ అనుదీప్ కామెడీ.. ఫుల్ నవ్వుకోవాల్సిందే..