Anudeep : స్కూల్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా.. నా జీవితంలో పెళ్లి లేదు.. అనుదీప్ లవ్ స్టోరీ తెలుసా?
ఈ ఇంటర్వ్యూలో లవ్ టాపిక్ రాగా అనుదీప్ తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు. (Anudeep)
Anudeep
Anudeep : జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా అనుదీప్ మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టాడు. అయితే అనుదీప్ తన సినిమాలతో కన్నా బయట ఈవెంట్స్ లో, టీవీ షోలలో వేసే పంచులతో, చేసే కామెడీతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటుడిగా గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇస్తున్నాడు.(Anudeep)
అనుదీప్ దర్శకుడిగా విశ్వక్ సేన్. కయదు లోహర్ జంటగా ఫంకీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూలో లవ్ టాపిక్ రాగా అనుదీప్ తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. స్కూల్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం నేను ఆమెకు చెప్పలేదు. అది వన్ సైడ్ లవ్. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవర్ని లవ్ చేయలేదు. ఇప్పుడు ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి కూడా లేదు అని తెలిపాడు.
