×
Ad

Vijay Deverakonda : గీత గోవిందం షూట్‌లో రష్మిక నుంచి నేర్చుకొని.. ఇప్పటికీ ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ..

విజయ్ - రష్మిక పెళ్లి వేడుకల సందర్భంగా వీరికి సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. (Vijay Deverakonda)

  • Published On : March 2, 2026 / 04:39 PM IST

Vijay Deverakonda

Vijay Deverakonda : గీత గోవిందం సినిమాతో పరిచయం అయి డియర్ కామ్రేడ్ సినిమా సమయానికి ప్రేమలో పడి కొన్నేళ్లు డేటింగ్ చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు విజయ్ – రష్మిక. వీరి పెళ్ళికి దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు అందుతున్నాయి. నేడు విజయ్ సొంతూళ్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. మార్చ్ 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుంది.

విజయ్ – రష్మిక పెళ్లి వేడుకల సందర్భంగా వీరికి సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రతి ఎండాకాలంలో పలు నగరాల్లో పెద్ద ట్రక్ నిండా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి ఫ్రీగా జనాలకి పంచుతాడని తెలిసిందే. ప్రతి సంవత్సరం విజయ్ ఇలా చేస్తాడు. ఇప్పుడు విజయ్ – రష్మిక పెళ్లి అయిన సందర్భంగా పలు నగరాల్లో స్వీట్ బాక్స్ లు జనాలకు పంచుతున్నారు. అలాగే పలు ఆలయాల్లో అన్నదానం నిర్వహిస్తున్నారు.

Also See : Vijay Rashmika : విజయ్ రష్మిక సత్యనారాయణ స్వామి వ్రతం.. సొంతూళ్లో ఊరందరికీ భోజనాలు..

అయితే ఇలా పంచిపెట్టడం అనేది విజయ్ రష్మిక నుంచే నేర్చుకున్నాడట. గతంలో నోటా సినిమా సమయంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ని ఐస్ క్రీమ్స్ పంచిపెట్టే ఆలోచన గురించి అడిగారు.

దీనికి విజయ్ సమాధానమిస్తూ.. గీత గోవిందం షూటింగ్ సమయంలో ఎండలకు అందరూ చెమటలు కక్కుకుంటూ పనిచేస్తున్నారు. ఒకరోజు సెట్లో పని చేస్తున్న వాళ్ళంతా ఐస్‌క్రీం తింటూ తిరుగుతుంటే ఈ ఐస్‌క్రీంలు ఏంటి అని అడిగాను. రష్మిక మేడమ్ కొనిచ్చింది అని నవ్వుతూ చెప్పారు వాళ్లంతా. వాళ్ళ నవ్వు చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అప్పుడే నా పుట్టినరోజు కూడా ఎండాకాలమే వస్తుంది కదా, నేనెందుకని ఒక ట్రక్కు నిండా ఐస్‌క్రీంలు తీసుకెళ్ళి అందరికీ పంచకూడదు అని అనుకున్నాను. రష్మిక నుంచి వచ్చిన ఆలోచనను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను అని తెలిపాడు.

Also Read : Harish Shankar : ఉస్తాద్ షూటింగ్ లో హరీష్ శంకర్ ని ఇబ్బంది పెట్టిన పవన్ సెక్యూరిటీ.. డిప్యూటీ సీఎం చెప్పినా వినలేదు..

అలా రష్మిక చేసిన మంచి పనిని ప్రతి సంవత్సరం ఫాలో అవుతున్నాడు విజయ్. వారి పరిచయం ఇప్పుడు పెళ్లి అయి జీవితాంతం కలిసి ఉండబోతున్నారు.