Do you know who came to Naga Chaitanya and Shobhita wedding
Naga Chaitanya-Sobhita :గత రెండేళ్లుగా రహస్య ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నిన్న రాత్రి అతికొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి పలువురు టాలీవడ్ సినీ ప్రముఖులు కూడా వచ్చారు.
Also Read : Sivakarthikeyan : అక్క గురించి శివ కార్తికేయన్ ఎమోషనల్ పోస్ట్..
అయితే చై, శోభిత వివాహానికి తమిళ స్టార్ హీరో కార్తీ వచ్చాడు. నాగార్జున, కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో నటించారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ సొంత బ్రదర్స్ లాగా ఉంటారు. ఆ చనువుతోనే కార్తీ చైతు పెళ్ళికి వచ్చాడు. ఓ ఫ్లవర్ బొకేతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలా కాసేపు వారితో మాట్లాడి.. పలు ఫోటోలు దిగారు. దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నయి. ఇప్పటికే నాగచైతన్య, శోభిత వివాహానికి సంబందించిన పలు ఫోటోలు కొందరు షేర్ చేసి విషెష్ తెలిపారు. ఇక ఇప్పుడు కార్తీ కూడా ఫొటోల్లో మెరిశారు.
కార్తితో పాటు నాగార్జునకి క్లోజ్ ఫ్రెండ్ అయిన మెగా స్టార్ చిరంజీవి సైతం వీరి వివాహ వేడుకకి హాజరయ్యారు. అలాగే వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి , సుహాసిని, కీరవాణి తదితరులు వచ్చారు.