Sivakarthikeyan : అక్క గురించి శివ కార్తికేయన్ ఎమోషనల్ పోస్ట్..

శివ కార్తికేయన్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అక్కకి సంబందించిన ఓ పోస్ట్ షేర్ చేసాడు.

Sivakarthikeyan : అక్క గురించి శివ కార్తికేయన్ ఎమోషనల్ పోస్ట్..

Siva Karthikeyan emotional post about his sister

Updated On : December 5, 2024 / 3:07 PM IST

Sivakarthikeyan : తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు

Also Read : Pushpa 2 : పుష్ప 2.. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్..

అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన అక్కకి సంబందించిన ఓ పోస్ట్ షేర్ చేసాడు.” మై డియర్ అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఓక బిడ్డ పుట్టిన తర్వాత MBBS పూర్తిచేసావు. MBBS పూర్తి చేయడం నుండి 38 సంవత్సరాల వయస్సులో గోల్డ్ మెడల్‌తో మెరిట్‌పై MD సంపాదించావు. ఇక ఇప్పుడు 42 సంవత్సరాల వయస్సులో FRCP సాదించావు. ఇప్పటివరకు అన్ని సాదించుకుంటూ వచ్చావు. నిన్ను చూసి నాన్న గర్వపడుతుంటారు. హ్యాపీ బర్త్ డే అక్క.. థ్యాంక్ యూ అథాన్ ఎల్లప్పుడూ అక్కకు అండగా నిలుస్తున్నందుకు ” అని ఎమోషనల్ గా ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan)


దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. నిజంగా ఈ వయస్సులో ఆవిడ ఇంత సాదించారంటే గ్రేట్ అనే చెప్పాలి. పిల్లలు పుట్టాక కూడా ఆమె తన చదువు ఎక్కడా మానెయ్యకుండా కంటిన్యూ చేస్తూ ఇంత వరకు వచ్చింది.