Chalapathi Rao : చలపతి రావు కొడుకు ఎవరో తెలుసా?

సినీ నటుడు చలపతి రావు.. నేడు తెల్లవారుజామున స్వర్గస్తులు అయ్యారు. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో 1200 పైగా చిత్రాల్లో నటించారు. ఇక విషయానికి వస్తే చలపతి రావు కొడుకు కూడా తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరుని, హోదాని సంపాదించుకున్నాడు. అతను ఎవరో కాదు దర్శకుడు మరియు నటుడు...

Do you know who is Chalapati Rao son

Chalapathi Rao : సినీ నటుడు చలపతి రావు.. నేడు తెల్లవారుజామున స్వర్గస్తులు అయ్యారు. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో 1200 పైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116 సినిమాతో వెండితెరకు పరిచయమైన చలపతి.. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతెరపై తనదైన ముద్ర వేశారు. నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు చలపతి. ‘చదరంగం’ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

Pawn Kalyan : నటుడు చలపతికి నివాళ్లు అర్పించిన పవన్ కళ్యాణ్..

ఇక విషయానికి వస్తే చలపతి రావు కొడుకు కూడా తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరుని, హోదాని సంపాదించుకున్నాడు. అతను ఎవరో కాదు దర్శకుడు మరియు నటుడు ‘రవిబాబు’. అల్లరి సినిమాతో తాను పరిచయం అవుతూ అల్లరి నరేష్ ని కూడా పరిచయం చేశాడు రవిబాబు. నచ్చావులే, నువ్విలా వంటి లవ్ స్టోరీస్‌తో పాటు అనసూయ, అవును వంటి సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని కూడా తెరకెక్కించి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

నటుడిగాను తన తండ్రికి తగట్టు ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తన తండ్రి తరువాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. చలపతికి రవిబాబుతో పాటు ఇద్దరు కుమార్తలు ఉన్నారు. ప్రస్తుతం ఒక కుమార్తె అమెరికాలో ఉంది. ఆమె బుధవారం హైదరాబాద్ చేరుకోనుంది. ఆమె వచ్చేవరకు చలపతి రావు భౌతికకాయాన్ని జూబిలీహిల్స్ మహాప్రస్థానం ఫ్రీజర్ లో పెట్టనున్నారు.