Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్ లో అరగుండుతో ఉన్న ఈ నటుడు ఎవరో తెలుసా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తన ఫాన్స్ ను ఇంకా వెయిట్ చేయించకూడదని నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. పాట్నాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

Do you know who this actor is with Aragundu in Pushpa 2 trailer

Pushpa 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తన ఫాన్స్ ను ఇంకా వెయిట్ చేయించకూడదని నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. పాట్నాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ సైతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్ధి వ్యూస్ తో దూసుకుతుంది. అయితే ఈ ట్రైలర్ లో చాలా హైలెట్ పాయింట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ట్రైలర్ లో ఆ అరగుండుతో కనిపించిన నటుడు ఎవరబ్బా అని జుట్టు పీక్కుంటున్నారు ఆడియన్స్.

Also Read : Amitabh Bachchan : 82 ఏళ్ల వయస్సులో తైక్వాండో కిక్.. అమితాబ్ వీడియో చూస్తే షాకే

అయితే ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలిసిందే. ఇక జాతర ఎపిసోడ్ ను ట్రైలర్ లో చూపిస్తూ ..నుదుట బొట్లు, మెడలో చెప్పుల దండతో ఉన్న ఓ నటుడు ని చూపించారు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలా అరగుండుతో కనిపిస్తున్న నటుడు మరెవరో కాదు తారక్ పొన్నప్ప. ఈయన కన్నడ యాక్టర్. కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.


ఇప్పటికే ఈ నటుడు “కేజిఎఫ్” సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే ఇటీవల వచ్చిన “దేవర” మూవీలో కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు “పుష్ప 2” మూవీలో ఏకంగా పుష్పరాజ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసాడు. అంతేకాదు “వికటకవి” అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తారక్ పొన్నప్ప.