Amitabh Bachchan : 82 ఏళ్ల వయస్సులో తైక్వాండో కిక్.. అమితాబ్ వీడియో చూస్తే షాకే

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కౌన్ బనేగా కరోడ్‌పతి 16. ఇప్పటికే ఈ షోకి చాలా మంది సినీ సెలెబ్రిటీస్ వచ్చారు. అయితే ఓ ఎపిసోడ్ లో ఒక చిన్నారి వచ్చింది. ఆ చిన్నారికి తైక్వాండో వచ్చు.

Amitabh Bachchan : 82 ఏళ్ల వయస్సులో తైక్వాండో కిక్.. అమితాబ్ వీడియో చూస్తే షాకే

Taekwondo kick at the age of 82 Shocking to see the video of Amitabh Bachchan

Updated On : November 18, 2024 / 7:11 PM IST

Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కౌన్ బనేగా కరోడ్‌పతి 16. ఇప్పటికే ఈ షోకి చాలా మంది సినీ సెలెబ్రిటీస్ వచ్చారు. అయితే ఓ ఎపిసోడ్ లో ఒక చిన్నారి వచ్చింది. ఆ చిన్నారికి తైక్వాండో వచ్చు. తన తైక్వాండో కిక్ చూపించమని అమితాబ్ బచ్చన్ తన సీట్ నుండి లేచి ఆ చిన్నారిని తీసుకొచ్చి అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి వద్దు సర్ అని కాస్త భయపడుతుంది.

Also, Read: Dhananjay : డాక్టర్ తో నిశ్చితార్ధం చేసుకున్న పుష్ప విలన్.. వీడియో చూశారా?

అలా కాసేపటి తరువాత ఆ అమ్మాయి తైక్వాండో కిక్ చేసి అమితాబ్ కి షాక్ ఇచ్చింది. తన కిక్ చూసి అమితాబ్ షాక్ అయ్యాడు. ఆ చిన్నారి దాదాపుగా అమితాబ్ ఎత్తుకి తన కాలు లేపి కిక్ ఇస్తుంది. అనంతరం ఆ చిన్నారిని అభినందించిన అమితాబ్ తనెందుకు ఈ కిక్ ట్రై చెయ్యకూడదని అంటాడు. ఎలా చెయ్యాలని తనని అడుగుతాడు. ఆ చిన్నారు వద్దు వద్దు అంటున్నప్పటికీ అమితాబ్ వినకుండా కిక్ ఇస్తాడు. ఆ చిన్నారికి ఏ మాత్రం తీసుకుపోకుండా అమితాబ్ చాలా ఎత్తుకు తన కాలును లేపి కిక్ ఇస్తారు. దీంతో అక్కడున్న వారందరరూ షాక్ అవుతారు.


అమితాబ్ బచ్చన్ కిక్ ఇవ్వగానే అక్కడున్న ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతూ.. ఈలలు.. కేకలు వేస్తారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటనే.. అమితాబ్ కి 82 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన ఇలాంటి విన్యాసాలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. 82 ఏళ్ల వయస్సులో అమితాబ్ ఈ స్టంట్ చెయ్యడం చూసి అక్కడున్న ఆడియన్స్ తో పాటు ఆ వీడియో చూసిన వారు సైతం షాక్ అయ్యారు.