Dhananjay : డాక్టర్ తో నిశ్చితార్ధం చేసుకున్న పుష్ప విలన్.. వీడియో చూశారా?
కన్నడ స్టార్ హీరో ధనంజయ అంటే తెలుగు ఆడియన్స్ అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమా విలన్ జాలిరెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుష్ప 1 లో జాలిరెడ్డిగా ఆకట్టుకున్నాడు ఈ నటుడు.

Pushpa movie villain who got engaged to the doctor video goes viral
Dhananjay : కన్నడ స్టార్ హీరో ధనంజయ అంటే తెలుగు ఆడియన్స్ అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమా విలన్ జాలిరెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుష్ప 1 లో జాలిరెడ్డిగా ఆకట్టుకున్నాడు ఈ నటుడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత, రచయితగా కూడా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన సత్యదేవ్ తో కలిసి జీబ్రా సినిమాలోనూ నటించారు.
Also Read : Pushpa 2 : రాజమౌళి, ఆర్జీవీతో సహా పుష్ప 2 ట్రైలర్ పై సెలబ్రిటీల కామెంట్స్.. బన్నీ ఏమన్నాడంటే
అయితే ఈ యంగ్ హీరో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఈయన డాక్టర్ ధన్యతతో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇరు కుటుంభ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా వీరు నిశ్చితార్ధం చేసుకున్నారు. కాగా ఫిబ్రవరి 16న మైసూరులో ధనుంజయ, ధన్యతల వివాహం జరగనుంది. దీంతో వీరిద్దరి నిశ్చితార్ధం కి సంబందించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ధనుంజయకి కాబోయే భార్య డాక్టర్.
View this post on Instagram
అంతేకాదు వీరిద్దరూ ఎప్పటి నుండో స్నేహితులు..అలా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి నిశ్చితార్ధం వరకు వచ్చింది. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇకపోతే ఇప్పటికే పుష్ప 1 లో విలన్ గా నటించిన ధనుంజయ ఇప్పుడు పుష్ప 2 లో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.