Pushpa 2 : రాజమౌళి, ఆర్జీవీతో సహా పుష్ప 2 ట్రైలర్ పై సెలబ్రిటీల కామెంట్స్.. బన్నీ ఏమన్నాడంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా పాట్నాలో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి బన్నీ, రష్మిక ఇద్దరూ వచ్చారు.

Pushpa 2 : రాజమౌళి, ఆర్జీవీతో సహా పుష్ప 2 ట్రైలర్ పై సెలబ్రిటీల కామెంట్స్.. బన్నీ ఏమన్నాడంటే

celebrities comments on pushpa 2 movie trailer including Rajamouli and RGV

Updated On : November 18, 2024 / 5:08 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా పాట్నాలో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి బన్నీ, రష్మిక ఇద్దరూ వచ్చారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ ఈవెంట్ కి లక్షల్లో బన్నీ ఫాన్స్ వచ్చారు. అయితే ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బన్నీ ఫాన్స్ కోరుకున్నట్టే ట్రైలర్ ఉందని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Also Read : Pushpa 2 : ట్రైలర్ తోనే కాదు, ట్రైలర్ ఈవెంట్ తో కూడా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

అయితే నిన్న ట్రైలర్ విడుదల చెయ్యగా చాలా మంది సినీ సెలెబ్రిటీస్ దీనిపై స్పందించారు. ఇక ట్రైలర్ పై రాజమౌళి స్పందిస్తూ..”పాట్నాలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయ్యింది. పుష్ప పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి బన్నీ రిప్లై ఇస్తూ.. థ్యాంక్ యూ సర్.. త్వరలోనే మీకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నానని” అన్నారు.

ప్రశాంత్ వర్మ ఈ ట్రైలర్ పై స్పందిస్తూ..వైల్డ్ ఫైర్.. రెబెలిన్ తిరిగి వచ్చాడు.. మునుపెన్నడూ చూడనంత ఉగ్రంగా ఉండబోతున్నాడు అని పేర్కొన్నాడు.. దానికి థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు బన్నీ.

అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తూ.. “ఇది నిజంగా వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్, సుకుమార్ సర్ మరోసారి అదరగొట్టేసారు. బిగ్ స్క్రీన్ పై పుష్ప 2 చూడడానికి వెయిట్ చేస్తున్నానని తెలిపారు. దీనిపై బన్నీ స్పందిస్తూ.. థాంక్యూ అనిల్ గారు’ అని రిప్లై ఇచ్చారు.

రిషబ్ శెట్టి పుష్ప 2 ట్రైలర్ పై స్పందిస్తూ.. పవర్ ప్యాక్ ట్రైలర్ తో అదరగొట్టేసారు. పుష్ప టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. దీనికి థాంక్యూ అని బన్నీ రిప్లై ఇచ్చారు.

హరీష్ శంకర్ స్పందిస్తూ.. ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ లో మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ప్రతి నిమిషంలో పుష్పరాజ్ ప్యాషన్, ప్రతి దాంట్లో సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుందని అన్నారు.. దానికి.. సర్ థాంక్యూ సర్ అని బన్నీ రిప్లై ఇచ్చారు.

బుచ్చి బాబు ట్రైలర్ పై స్పందిస్తూ.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్ అని అంటే.. థాంక్యూ అని బన్నీ రిప్లై ఇచ్చాడు.

రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ చూసి.. ట్రైలర్ చూస్తుంటే స్ట్రాటోస్పియర్ గుండా వెళుతున్నట్లు కనిపిస్తోంది.. అల్లు అర్జున్ ఒక మెగామెగాటోవర్ప్లానెటరీ స్టార్ అంటూ తెలిపారు.

శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ.. ఇంటెర్నేష్నల్ సినిమా..ట్రైలర్ గురించి మాట్లాడడానికి మాటలు లేవు, అల్లు అర్జున్ సర్.. మీ హార్డ్ వర్క్ కి మీ డెడికేషన్ కి.. అందరి ప్రేమ, అభినందనలను పొందడానికి మీరు అర్హులు అని పేర్కొన్నారు. దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ..థాంక్యూ.. మీరు ఒక మ్యాజిక్ గురు అని రిప్లై ఇచ్చాడు.

హను రాఘవాపుడి స్పందిస్తూ.. పుష్ప 2 ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది. అద్భుతంగా ఉంది. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ గారికి ఆల్ ది బెస్ట్.. అన్నారు. దానికి బన్నీ రిప్లై ఇస్తూ.. థాంక్యూ హను గారు.. మీకు మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నా అని అన్నారు.

అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ.. వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5న రాబోతుందని అంటే.. థాంక్యూ బ్రదర్.. క భారీ విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు.. పుష్ప తో బిజీ గా ఉండడం వల్ల మీ సినిమా చూడలేదు. కచ్చితంగా సినిమా చూసి మీకు కాల్ చేస్తాను అని బన్నీ తెలిపారు. ఇలా చాలా మంది సెలెబ్రిటీస్ పుష్ప 2 ట్రైలర్ పై స్పందించడంతో వారి పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.