Pushpa 2 : ట్రైలర్ తోనే కాదు, ట్రైలర్ ఈవెంట్ తో కూడా చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 ట్రైలర్ హావానే నడుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది.

Allu Arjun created history not only with the Pushpa 2 trailer but also with the trailer event
Pushpa 2 : ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 ట్రైలర్ హావానే నడుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది. నిన్న బీహార్ లోని పాట్నాలో ఈ ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. కాగా ఈ ఈవెంట్ కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ వచ్చి సందడి చేసారు. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుండే పాస్ ల కోసం తెగ కొట్టుకొని పాస్ లను దక్కించుకున్నారు.
Also Read : Resul Pookutty : పుష్ప 2 పై ఆస్కార్ విజేత పోస్ట్.. సౌండ్ డిజైనింగ్ అదిరిపోతుందట..
అయితే లక్షల మంది వచ్చిన ఈ ఈవెంట్ మరో అరుదైన ఘనత సాధించింది. అదేంటంటే.. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను అత్యధిక వ్యూవర్స్ చూసినట్టు పుష్ప టీమ్ అధికారికంగా ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా ఈవెంట్ లైవ్ ని ఇంత మంది జనాలు చూసింది లేదు. పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ లైవ్ ను దాదాపుగా 2.6 లక్షల మంది చూసారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఈవెంట్ లైవ్ ను ఇంత భారీ మొత్తంలో చూసింది లేదు. కానీ పుష్ప 2 ఈ ఘనత కూడా సాధించింది.
ఇక ఈ ఈవెంట్ కి భారీ ఎత్తున జనాలు రావడంతో పోలీసులు, సెక్యూరిటీ ని కూడా భారీగా ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.