Resul Pookutty : పుష్ప 2 పై ఆస్కార్ విజేత పోస్ట్.. సౌండ్ డిజైనింగ్ అదిరిపోతుందట..

ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై వస్తున్న కంప్లైంట్స్ పై అసంతృప్తిగా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్కువగా ఉందని ఇప్పటికే చాలా మంది వ్యూవర్స్, సినీ లవర్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

Resul Pookutty : పుష్ప 2 పై ఆస్కార్ విజేత పోస్ట్.. సౌండ్ డిజైనింగ్ అదిరిపోతుందట..

Oscar winner post on Pushpa 2 movie Sound designing is awesome

Updated On : November 18, 2024 / 2:33 PM IST

Resul Pookutty : ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై వస్తున్న కంప్లైంట్స్ పై అసంతృప్తిగా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్కువగా ఉందని ఇప్పటికే చాలా మంది వ్యూవర్స్, సినీ లవర్స్ ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబందించిన పోస్ట్ లు కూడా పెడుతున్నారు. ఇక ఈ విషయానికి గాను స్పందించిన ఆస్కార్-విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి పుష్ప 2 విషయం లో ఇలాంటి తప్పు జరగదని పేర్కొన్నారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్.. ఆ రికార్డు సాధించిన ఫస్ట్ సౌత్ మూవీ..

తాజాగా ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ వదిలారు. అందులో ఇలా పేర్కొన్నారు.. పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. పెద్ద ఎత్తున ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సందర్బంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే.. పుష్ప2 స్టాండర్డ్ డాల్బీ లెవల్ 7లో మిక్స్ చేయబడుతుంది. పుష్ప2 వచ్చే ముందే ఆంప్స్ , స్పీకర్‌ లని ట్యూనింగ్ చేసి పెట్టుకోండని ఈ సందర్బంగా అన్ని థియేటర్స్ ను కోరుతున్నాని ఆయన పేర్కొన్నాడు. అలాగే పుష్ప 2 ఎడిటింగ్ రూమ్ లో దేవిశ్రీ ప్రసాద్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ ను కూడా ఆ పోస్ట్ లో ట్యాగ్ చేశారు.


ఇక కంగువా సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఆడియన్స్ తల నొప్పిగా భావించారని ఆయన ఇదివరకే చెప్పారు. కాగా ఇప్పుడు పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కంగువాకి జరిగినట్టు జరగకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆస్కార్ విజేత సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.