Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్.. ఆ రికార్డు సాధించిన ఫస్ట్ సౌత్ మూవీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ నిన్న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా బీహార్ పాట్నాలో నిర్వహించారు. లక్షలమంది జనాభా మధ్య ట్రైలర్ ను లాంచ్ చేసారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Allu Arjun Pushpa 2 Movie trailer First South movie to achieve that record
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ నిన్న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా బీహార్ పాట్నాలో నిర్వహించారు. లక్షలమంది జనాభా మధ్య ట్రైలర్ ను లాంచ్ చేసారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని, పుష్ప 2 కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Also Read : Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. కోర్టు ముందు కాదు.. పోలీసుల ముందు అలా చేయండి..!
అయితే నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుండి యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందుతుంది. కాగా ట్రైలర్ విడుదలైన కేవలం 15 గంటల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగులో ట్రైలర్ వచ్చిన 15 గంటల్లోనే 40 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీంతో చాలా మంది హీరోల రికార్డు కూడా బ్రేక్ చేసాడు బన్నీ. తెలుగులో15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ సంపాదించుకుందంటే 24 గంటలు పూర్తయ్యే సరికి ఇంకెన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటుందో చూడాలి. తెలుగులోనే 40 మిలియన్ కి పైగా వ్యూస్ తెచుకుందంటే అన్ని భాషల్లో కలిపి ఇంకెన్ని మిలియన్ వ్యూస్ అందుకుందో ఊహించొచ్చు. దీనితో మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఇలాంటి ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన తను అసలు పుష్ప 2 తో ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు, ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలు మించేలా ట్రైలర్ కూడా ఉంది. మరి ట్రైలర్ ఏ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి.