documentary on rapper Yo Yo Honey Singh
Yo Yo Honey Singh : ప్రముఖ ఇండియన్ టాప్ రాప్ సింగర్ యోయో హనీ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి టాప్ సింగర్ గా ఎదిగాడు ఈయన. తాజాగా ఈయన డాక్యూమెంటరీ తీశారు. ‘హ్యూమన్’ ఫేమ్ మోజెజ్ సింగ్ దర్శకత్వం యోయో హనీ సింగ్ ఫేమస్ అనే డాక్యూమెంటరీ రానుంది. నిజ జీవితంలో ఆయన ఎదురుకున్న సవాళ్లు, ఎన్ని ఇబ్బందులను ఎదురుకొని ఈ స్థాయికి చేరుకున్నారో ఈ డాక్యూమెంటరీ లో చూపిస్తారంట.
Also Read : Nani : పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ నుండి ఫ్యాన్స్ నాని కోసం ఫోన్స్ చేసి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆస్కార్ విజేత సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు రాబోతుందో తాజాగా ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 20న ఈ డాక్యుమెంటరీ మూవీ రానున్నట్టు తెలిపారు. అలాగే.. “మీకు తెలిసిన పేరు, మీకు తెలియని కథ. భారతీయ సంగీత రూపాన్ని శాశ్వతంగా మార్చిన ఒక లెజెండ్ యొక్క ఎదుగుదలకు సాక్షి. యో యో హనీ సింగ్: ఫేమస్‌ని డిసెంబర్ 20న, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూడండి ” అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.