Nani : పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ నుండి ఫ్యాన్స్ నాని కోసం ఫోన్స్ చేసి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా షూటింగ్ లో ఆయన చేసిన ఓ తప్పు గురించి ఇంటర్వ్యూ లో తెలిపారు.

Director Mohan Krishna Indraganti interesting comments on nani
Nani : నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక వాటిలో జెంటిల్‌మెన్ సినిమా కూడా ఒకటి. నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన ఈ సినిమా 17 జూన్ 2016న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇందులోని సాంగ్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాతో ఈ నటీనటుల గుర్తింపు మరింత పెరిగిందని చెప్పొచ్చు.
అయితే తాజాగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా షూటింగ్ లో ఆయన చేసిన ఓ తప్పు గురించి ఇంటర్వ్యూ లో తెలిపారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇంకా అందులో ఆయన మాట్లాడుతూ..”జెంటిల్‌మెన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. నాని నివేదా ఇద్దరూ ఎదురెదురుగా రెండు బిల్డింగ్స్ పై నిలుచొని ఫోన్స్ లో మాట్లాడతారు. ఆ సీన్ కోసం నా ఫోన్ నాని కి ఇచ్చాను. అందులో నివేదా కి కాల్ చేసి మాట్లాడాలి. అప్పుడు ఫోన్ లో నా నెంబర్ వాడారు. దాంతో ఆడియన్స్ ఆ ఫోన్ నంబర్ నానిదని అనుకోని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆ నంబర్ కి ఫోన్స్ చేసేవారని తెలిపారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 దెబ్బకు బాలివుడ్ బాద్ షా రికార్డు గల్లంతు..
అంతేకాదు.. రోజు పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయని పేర్కొన్నారు. జెంటిల్‌మెన్ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఆయన ఫ్యాన్స్ కాల్స్ చేస్తున్నారని, వాళ్ళ బాధకి సిమ్ మారుద్దామనుకున్నా కానీ కొన్ని ఓటీపీ ల వల్ల మార్చలేదని తెలిపారు. పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ నుండి కూడా నాని అభిమానులు ఫోన్స్, మెసేజీలు చేస్తుండేవారని తెలిపాడు. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.