Pushpa 2 : పుష్ప 2 దెబ్బకు బాలివుడ్ బాద్ షా రికార్డు గల్లంతు..

ముఖ్యంగా అల్లు అర్జున్ కి నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తాజాగా ఈ సినిమా హిందీలో రికార్డు బ్రేక్ చేసింది.

Pushpa 2 : పుష్ప 2 దెబ్బకు బాలివుడ్ బాద్ షా రికార్డు గల్లంతు..

Allu Arjun Pushpa 2 movie broke the record of Shahrukh Khan Jawaan movie

Updated On : December 6, 2024 / 4:06 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ సక్సెస్ తో దూసుకుపోతుంది.

Alos Read : Salman Khan : సల్మాన్ ఖాన్ కి మళ్ళీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా షూటింగ్ స్పాట్ లో

ముఖ్యంగా అల్లు అర్జున్ కి నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తాజాగా ఈ సినిమా హిందీలో రికార్డు బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా హిందీలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటి రోజే 72 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని ఇండియాలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు అందుకున్న హిందీ సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది.

ఇక ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ను కూడా వెనక్కి నెట్టేశాడు అల్లు అర్జున్. షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’ గత ఏడాది రూ.64 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. ఇక ఈ ఏడాది షారుక్ సొంతమైన ఈ రికార్డు కొల్లగొట్టాడు బన్నీ. అయితే ఈ రికార్డు ను టాలీవుడ్ హీరో బ్రేక్ చెయ్యడం విశేషమని చెప్పొచ్చు.