Salman Khan : సల్మాన్ ఖాన్ కి మళ్ళీ బెదిరింపులు.. ఈసారి ఏకంగా షూటింగ్ స్పాట్ లో
ముంబైలోని జోన్ 5లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ షూటింగ్ లొకేషన్‌లోకి బుధవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు.

Threats to Salman Khan again at his movie shooting spot
Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా తన సినిమా షూటింగ్ స్పాట్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని జోన్ 5లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ షూటింగ్ లొకేషన్‌లోకి బుధవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. అనంతరం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరు చెప్తూ బెదిరించడం స్టార్ట్ చేసాడు.
అనంతరం అతడిని షూటింగ్‌లో ఉన్న ఇతర సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ వ్యక్తి సరాసరి షూటింగ్ లోకి వచ్చి బెదిరించడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read : Pushpa 3 : పుష్ప 3 లో విలన్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ..?
గతకొంత కాలంగా బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్‌కు భద్రతను కేటాయించారు. అతని నివాసం, గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అలాగే స్వంతగా ఆయన సైతం కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు.