Chaitanya-Sobhita : చైతన్య, శోభిత పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా అక్కినేని చిన్న కోడలు.. అఖిల్, జైనాబ్ ఫోటోలు చూశారా..
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్, జైనాబ్‌లు నాగ చైతన్య వివాహ వేడుక సందర్భంగా మొదటి సారి కలిసి ఫ్యామిలీతో కనిపించారు.

Akkineni younger daughter in law Zainab as a special attraction at Chaitanya and Shobhita wedding
Chaitanya-Sobhita : డిసెంబర్ 4న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహం జరిగింది. వీరి వివాహాం అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిపించాడు నాగార్జున. వీరి వివాహానికి సంబందించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోల్లో అక్కినేని చిన్న కోడలు కూడా ఉంది. ఆమె ఈ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Also Read Chaitanya-Sobhita : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కొత్త జంట నాగచైతన్య, శోభిత.. ఫోటో వైరల్..
ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న అఖిల్, జైనాబ్‌లు నాగ చైతన్య వివాహ వేడుక సందర్భంగా మొదటి సారి కలిసి ఫ్యామిలీతో కనిపించారు. జైనాబ్ కుటుంబంతో కలిసి మెలిసి కనిపించడంతో ఆమె పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం తనకి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక జైనాబ్ అఖిల్, అతని కుటుంబంతో కలిసి బంగారు రంగు చీరలో పద్దతిగా కనిపించింది.
కాగా ఇప్పటికే నాగార్జున.. 2025లో అఖిల్, జైనాబ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటించారు. జైనాబ్ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. అఖిల్ సైతం ఈమెతో కలిసి దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసాడు. కాగా ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతన్నాయి.