ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 2019. వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి..20వ ఎడిషన్ వేడుకలు ముగిసాయి కూడా. పలు కేటగిరీల్లో పలువురు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య పూర్తైన ఈ వేడుకల్లో ఓ ప్రత్యేక చోటుచేసుకుంది. హై సెక్యూరిటీ మధ్య జరిగాయి ఈ వేడుకలకు అనుకోకుండా ఓ గెస్ట్ ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను ప్రముఖ నటి..మోడల్ అదితి భాటియా ఇంటర్వ్యూ చేసింది. మరి ఆ ఇంటర్వ్యూ విశేషాలేంటో తెలుసుకుందాం..
ఐఫా వేడుకల ఫంక్షన్‌లో సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. అయినా సరే ఎలా వచ్చిందో తెలీదు కానీ ఓ కుక్క లోపలికి వచ్చింది. ఆ కుక్కను చూసిన నటి అదితి భాటియాకు ఓ ఐడియా వచ్చింది. దాంతో సరదాగా గడిపింది. తరువాత హాయ్..ఇక్కడకు అనుకోకుండా ఓ స్పెషల్ గెస్ట్ వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం.. అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. ఆ కుక్క కూడా ఏమాత్రం బెదరలేదు..చక్కగా భాటియాకు తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ వీడియోను అదితి తన ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది.
ఈ వీడియోని రెండు రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా చూశారు. అతిది చెప్పేది చక్కగా వింటూ ఎంత పద్ధతిగా ఉందో అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ … ఆ కుక్క సార్ కాదనీ… మేడమ్ అని కామెంట్ చేశారు. ఇంతకంటే క్యూటర్ వీడియో ఉంటుందా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. మరికొందరు బహుశా అవార్డు అందుకోవటానికి వచ్చిందేమో.. అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.