Ranveer Singh : ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ కెప్టెన్ జాక్ స్పారోతో రణవీర్ ఫోటో వైరల్..

కెప్టెన్ జాక్ స్పారోతో రణవీర్ ఫోటో వైరల్. ఇంతకీ వీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిశారు..?

Don 3 star Ranveer Singh with Johnny Depp photo gone viral

Ranveer Singh : బాలీవుడ్ ఖాన్‌త్రయం తరువాత ఇండియా వైడ్ అంతటి పాపులారిటీని సంపాదించుకున్న హీరో రణవీర్ సింగ్. ప్రస్తుతం ఈ హీరో వరుస ప్లాప్ ల్లో ఉన్నారు. 2018లో టాలీవుడ్ మూవీ ‘టెంపర్’కి రీమేక్ గా తెరకెక్కిన ‘సింబా’ తరువాత మళ్ళీ ఒక్క హిట్టు అందుకోలేదు. ఈ ఏడాది ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ అంటూ ఫామిలీ ఎంటర్టైనర్ తో వచ్చినా పెద్ద ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం సింగం 3, డాన్ 3 సినిమాల్లో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ హీరో ఇంటర్నేషనల్ స్టార్ తో కనిపించారు.

హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ అందరూ చూసే ఉంటారు. ఇక ఈ సిరీస్ లో కెప్టెన్ జాక్ స్పారో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జానీ డెప్‌ తన యాక్టింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఆ పాత్రని ఇంటర్నేషనల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఓన్ చేసుకునేలా చేశారు. మూవీ స్టార్స్ లో కూడా జానీ డెప్‌ కి అభిమానులు ఉంటారు. తాజాగా రణవీర్, జానీ డెప్‌తో కలిసి దిగిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ వీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ కలిశారు..?

Also read : Nani : సందీప్ వంగా మొదటి సినిమా నానితో చేయాల్సింది.. కానీ ఏమైందంటే..!

రీసెంట్ గా సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’లో ఈ ఇద్దరు కలుసుకున్నారు. ఈ పురస్కారంలో రణవీర్ అరుదైన గౌరవం అందుకున్నారు. ‘షరోన్ స్టోన్’ అవార్డుతో రణవీర్ ని గౌరవించారు. ఈ అరుదైన అవార్డుని తనకి అందించినందు రణవీర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అవార్డు అందుకునే ముందు జానీ డెప్‌ తన ఇన్‌స్పిరేషన్ అంటూ తెలియజేశారు. అనంతరం రణవీర్ తను అందుకున్న అవార్డుతో జానీ డెప్‌తో కలిసి ఫోటోకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.