Vani Jairam : వాణీ జయరాం మరణంపై అనుమానాలు.. పోస్టుమార్టంలో గాయాలు గుర్తింపు!

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం ఫిబ్రవరి 4న ఆమె ఇంటిలో కన్నుమూశారు. అయితే ఈ మరణం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టంలో..

Vani Jairam : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా స్వర్గస్తులు అవుతూ విషాదాన్ని మిగిల్చి వెళుతున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే, రోజు వ్యవధిలోనే మరో మరణవార్త ఇండస్ట్రీని కలిచి వేసింది. ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం నిన్న (ఫిబ్రవరి 4) కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆమె మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

Vani Jairam: సినీ ఇండస్ట్రీలో ఆగని విషాదాలు.. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

చెన్నైలోని ఆమె ఇంటిలో జయరాం కన్నుమూశారు. అయితే ఈ మరణం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిన్న ఉదయం పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ జయరాం డోర్ తియ్యకపోవడంతో, డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూసినట్లు పనిమనిషి పోలీసులకు తెలియజేసింది. పోస్టుమార్టంలో కూడా ఆమె నుదురు మొఖం పై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు దీనిని సాధారణ మరణంగా కాకుండా అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ విచారణ మొదలుపెట్టారు.

ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులను ఇంటికి పంపించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య కోణంలో విచారిస్తున్న పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా వాణీ జయరాం పోస్టుమార్టం కంప్లీట్ రిపోర్ట్ వస్తే గాని మరణం గల కారణాలు చెప్పలేము అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ లోపే ఆమె మరణవార్త అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.

50 ఏళ్ల సినీ జీవితంలో 10 వేలకు పైగా పాటలను పాడారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ కలిపి దాదాపు 18 భాషల్లో పాటలను పాడారు జయరాం. ఇక ఆమె ముందు మరణించిన కె.విశ్వనాధ్ సినిమాల్లో దాదాపు ఆమె ఎక్కువుగా పాటలు పాడారు.

 

ట్రెండింగ్ వార్తలు