Dr. Rajasekhar 92: ‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా తన 91వ సినిమా వివరాలు వెల్లడించారు. ‘శేఖర్’ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌లుక్ వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
https://10tv.in/dr-rajasekhar-in-as-shekar/
శనివారం రాజశేఖర్ 92వ సినిమాను ప్రకటించారు మేకర్స్.. కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివానీ – శివాత్మిక, సృజన్ యర్రబోలు, హర్ష, భార్గవ్ పోలుదాసు, హర్ష ప్రతాప్ నిర్మిస్తున్నారు. ఇంగ్లీష్ డెయిలీ పేపర్‌పై కూలింగ్ గ్లాస్, గన్, బుల్లెట్స్, సిగార్, మందుగ్లాసుతో ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
https://10tv.in/sensational-thriller-gatham-has-been-picked-for-screening-at-iffi-goa/
పోస్టర్ మేకింగ్ చూస్తుంటే మరోసారి రాజశేఖర్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనిపిస్తోంది. రాజశేఖర్ పోలీస్ క్యారెక్టర్ చేసిన సినిమాలన్నీ ఆకట్టుకున్నాయి.
గతేడాది ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకోవడంతో పాటు 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచిన ‘గతం’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు.. రాజశేఖర్ 92వ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.