Draupathi 2 : ‘ద్రౌపతి 2’ సినిమా.. ఈసారి తమిళ్ తో పాటు తెలుగులో కూడా.. రాజుల కథతో..

గతంలో ఇదే డైరెక్టర్ ద్రౌపతి అనే సినిమా తీసి వివాదాల్లో నిలిచాడు. ఆ సినిమాకు ఇది ప్రీక్వెల్ అని తెలుస్తుంది.(Draupathi 2)

Draupathi 2

Draupathi 2 : నేతాజీ ప్రొడక్షన్స్ సమర్పణలో చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యానర్లో మోహ‌న్‌.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ద్రౌప‌తి 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. గతంలో ఇదే డైరెక్టర్ ద్రౌపతి అనే సినిమా తీసి వివాదాల్లో నిలిచాడు. ఆ సినిమాకు ఇది ప్రీక్వెల్ అని తెలుస్తుంది.

ఈ సినిమా 14వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు త‌మిళ‌నాడులోకి ప్రవేశించిన సమయంలో కథ, చ‌రిత్రాక ఘ‌ట‌నల ఆధారంగా, దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

Also See : Nikki Galrani Aadhi Pinisetty : భార్యతో హీరో ఆది పినిశెట్టి.. వినాయకచవితి, వరలక్ష్మి పూజ స్పెషల్ ఫొటోలు..

రిచ‌ర్డ్ రిషి, ర‌క్ష‌ణ ఇందుసుద‌న్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా న‌ట్టి న‌ట‌రాజ్, వై.జి.మ‌హేంద్ర‌న్‌, మన తెలుగు భామలు దివి, దేవ‌యాని శ‌ర్మ‌.. తో పాటు అనేక మంది తమిళ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయింది. మరి ఈ చారిత్రక సినిమా 2020లో వచ్చిన ద్రౌపతి కథకు ఎలా లింక్ చేస్తారో చూడాలి.

Also See : Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..