జూనియర్‌ మహర్షి ‘సితార’ తో డాన్స్ చేస్తున్న..DSP

  • Publish Date - March 23, 2019 / 07:43 AM IST

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార తన డాన్స్‌తో అదరగొట్టింది. ఇటీవల బాహుబలి సినిమాలో మురిపాలా ముకుంద పాటకు సితార డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తో మరో డాన్స్‌ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
Read Also : నా ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు : రకుల్‌ ప్రీత్‌సింగ్‌

దేవీ శ్రీ శ్రీమంతుడు సినిమాలోని పాటను పాడుతుంటే సితార డాన్స్‌ తన స్నేహితురాలు ఆద్యా (వంశీ పైడిపల్లి కూతురు) కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేశాడు దేవీ. అంతేకాదు జూనియర్‌ మహర్షి (సితార) నాకు డాన్స్‌ చేయటం నేర్పిస్తోంది అంటూ కామెంట్ చేశాడు DSP. ప్రస్తుతం మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాకు దేవీ శ్రీ ప్రసాదే సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.