Dulquer – Ram Charan : ‘రంగస్థలం’కి రావాల్సినంత గుర్తింపు రాలేదు.. ఇప్పుడు వచ్చి ఉంటే.. దుల్కర్ సల్మాన్ వ్యాఖ్యలు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ రంగస్థలం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Dulquer Salmaan Interesting Comments on Ram Charan Rangasthalam Movie

Dulquer – Ram Charan : మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ ఇటీవల మలయాళంలో కంటే వేరే భాషల్లో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో అయితే వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. మంచి మార్కెట్ కూడా సంపాదించుకున్నారు. దుల్కర్ లక్కీ భాస్కర్ సినిమాతో దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది.

దీంతో లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ రంగస్థలం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల మీరు చూసిన వాటిల్లో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన తెలుగు సినిమా ఏంటి అని యాంకర్ అడిగారు.

Also Read : ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్న పుష్ప టీం!

దీనికి దుల్కర్ సల్మాన్ సమాధానమిస్తూ.. రీసెంట్ గా కాదు కానీ రంగస్థలం సినిమాని ఇటీవల మళ్ళీ చూసాను. అది ఒక సూపర్ సినిమా. చరణ్ అద్భుతంగా యాక్ట్ చేసాడు. సినిమాలో మంచి ట్విస్టులు ఉన్నాయి అవి ఊహించలేదు కూడా. అది మన రూటెడ్ సినిమా. ఇటీవల మన కథలు, విలువలు ఉన్న సినిమాలు చాలా పాన్ ఇండియా సక్సెస్ అవుతున్నాయి. రంగస్థలం సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను. ఆ సినిమాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు వచ్చి ఉంటే పాన్ ఇండియా సక్సెస్ అయ్యేది అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ వీటిని మరింత వైరల్ చేస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం కేవలం తెలుగులోనే రిలీజయి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా భారీ విజయం సాధించేది అని ఇప్పటికి చరణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ యూనిట్, పలువురు సినీ ప్రముఖులు భావిస్తారు.