Dulquer Salmaan: ఒక సినిమా హిట్.. ఇంకో సినిమా పోస్ట్ పోన్.. దుల్కర్ ప్లాన్ మాములుగా లేదుగా!

సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రయాణాన్ని విజయాలే నిర్ణయిస్తాయి. ఎన్ని విజయాలు వస్తే అంత(Dulquer Salmaan) డిమాండ్. అందుకే, సినిమాలు ఒప్పుకునే విషయంలో, వాటి విడుదల విషయం ఆచితూచి అడుగులు వేస్తుంటారు స్టార్స్.

Dulquer Salmaan's Kaantha movie release postponed

Dulquer Salmaan: సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రయాణాన్ని విజయాలే నిర్ణయిస్తాయి. ఎన్ని విజయాలు వస్తే అంత డిమాండ్. అందుకే, సినిమాలు ఒప్పుకునే విషయంలో, వాటి విడుదల విషయం ఆచితూచి అడుగులు వేస్తుంటారు స్టార్స్. ఇప్పుడు మరోసారి అలాంటి ప్లానే చేస్తున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ హీరో నిర్మాతగా మరి చేసిన లేటెస్ట్ మూవీ కొత్త లోక. కళ్యాణి ప్రియదర్శన్, నెస్లేన్ జంటగా వచ్చిన ఈ సినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించాడు. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను వివరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

Rana-Ram Charan: జై రామ్ చరణ్.. ఫ్యాన్ వింత రియాక్షన్.. రానా ఏమన్నాడో తెలుసా?

అయితే, ఈ సినిమా తరువాత దుల్కర్ నిర్మాత, హీరోగా చేస్తున్న సినిమా కాంత(Dulquer Salmaan). ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తుండగా, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అవ్వాల్సింది. కానీ, కొత్త లోక సినిమా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుండటంతో నిర్మాత దుల్కర్ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశాడు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు.

కాంత సినిమా టీజర్ విడుదల అయినప్పటినుండి మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. కాబట్టి, దానికి ప్రతిఫలంగా అనుభూతిని మీకు ఇవ్వాలని భావిస్తున్నాం. కొత్త లోక మంచి విజయం సాధించింది. అందుకే కాంత సినిమాతో మరో కొత్త లాకాన్ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అందుకే, కాంత విడుదల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాము. అంతవరకు మా సినిమాపై మీ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. అంటూ చెప్పుకొచ్చారు.