Dulquer Salmaan : కొంతమంది మహిళల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను.. ఒకావిడ అభ్యంతరకరంగా తాకింది..

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.

Dulquer Salman says some female fans misbehave with him

Dulquer Salmaan : మలయాళం(Malayalam) స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో కూడా మహానటి, సీతారామం(Sita Ramam) సినిమాలతో హిట్స్ కొట్టి మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు కింగ్ అఫ్ కొత్త(King of Kotha) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు దుల్కర్. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కానుంది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాల గురించి తెలిపాడు.

Dulquer Salmaan : సోనమ్ కపూర్ పై రానా వ్యాఖ్యలు.. స్పందించిన దుల్కర్ సల్మాన్..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఒకే కన్మణి, సీతారామం సినిమాల తర్వాత నాకు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సాధారణంగా నాకు ఎక్కువగా అబ్బాయిల్లో ఫ్యాన్స్ ఉంటారు. నేను వాళ్ళతో టచ్ లో ఉంటాను. కానీ మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగాక వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది మహిళలు ఫోటో తీసుకుంటాను అంటూ బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ ప్రవర్తనతో ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక పెద్దావిడ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆమె నన్ను అభ్యంతకరంగా తాకింది. ఆ విషయంలో నాకు చాలా బాధగా అనిపించింది అని తెలిపారు. దీంతో దుల్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.