Ramya Krishnan: ప్రెగ్నెన్సీ టైంలో ‘జూనియర్ ఎన్టీఆర్’తో డాన్స్ చేశా.. రమ్యకృష్ణ!

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస పెట్టి సినిమాలు చేస్తూ అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తూనే, ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ..

During Pregnancy Ramya Krishna Danced with Junior NTR

Ramya Krishnan: టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ.. సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస పెట్టి సినిమాలు చేస్తూ అదరహో అనిపిస్తుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ సీనియర్ నటి ప్రస్తుతం క్యారక్టర్ అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తుంది.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్ పేరు.. ఎవరంటే?

ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తూనే, ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కొత్తలో తాను ‘ప్రెగ్నెన్సీ’తోనే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి డాన్స్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.

తారక్ హీరోగా తెరకెక్కిన “నా అల్లుడు” సినిమాల్లో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కు అత్తగా నటించింది. ఆ సినిమాల్లో వీరిద్దరిపై ఒక సాంగ్ చిత్రీకరిస్తున్న సమయంలో.. ఆమె 4 నెలల గర్భిణీగా ఉందట. ఇక ఈ సాంగ్ కు డాన్స్ ఐకాన్ షోలో ఒక కంటెస్టెంట్ డాన్స్ చేయగా, ఆ సాంగ్ తనకు ఎంతో ప్రత్యేకమంటూ.. దాని వెనుక ఉన్న కథని చెప్పుకొచ్చింది.