ENE Repeat : వామ్మో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొనుక్కుందో తెలుసా?

నవంబర్ 19న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. (ENE Repeat)

  • Published on- November 9, 2026 / 02:52 PM IST

ENE Repeat

ENE Repeat : 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ గా ENE రిపీట్ రాబోతుంది. విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మెయిన్ లీడ్స్ లో అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్, కరుణకుమార్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

నవంబర్ 19న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పార్ట్ 1 గోవా బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఈ సినిమా బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు తెలుస్తుంది. ఇటీవలే ENE రిపీట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాకు ఓటీటీ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చిందట.

Also Read : Ram Charan : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు చరణ్.. కొత్త హీరో కోసం వస్తున్న మెగా పవర్ స్టార్.. లైవ్ కాన్సర్ట్ ఎప్పుడు? ఎక్కడ?

ENE రిపీట్ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు 11 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుక్కున్నారు. అయితే ఇది బేసిక్ ప్రైస్ మాత్రమే. ఇటీవల సినిమాలు హిట్ అయి భారీ కలెక్షన్స్ సాధిస్తే ఓటీటీలు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా ENE రిపీట్ కి కూడా నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసారంట. ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే డబల్ అమౌంట్ అంటే 22 కోట్లు ఓటీటీ నుంచి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజయినప్పుడు మాములు హిట్ అయినా తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ అయి క్లాసిక్ గా నిలిచింది. దాంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులు కొనుక్కున్నట్టు తెలుస్తుంది.