Eesha Rebba : అభిమానులకు షాక్ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు.. తండ్రి ఎక్కడంటే..?
అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా (Eesha Rebba )అంతకు ముందు ఆ తరువాత సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 19, 2023 / 06:08 PM IST
Eesha Rebba
Eesha Rebba : అచ్చ తెలుగు అందం ఈషా రెబ్బా (Eesha Rebba ) ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో పద్దతిగా పక్కింటి అమ్మాయిలా ఉండే ఈషా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అందంతో పాటు అభినయం కలగలసినప్పటికీ తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమలపై ఫోకస్ చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ‘మాయాబజర్ ఫర్ సేల్’ (Mayabazar For Sale) అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా సుమ అడ్డా (Suma Adda) అనే షోకు టీమ్‌తో కలిసి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ప్రొమోను విడుదల చేయగా అందులో ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందని యాంకర్ సుమ ప్రశ్నించగా తొందరపడినప్పుడు అంటూ ఈషా రెబ్బా నొక్కి సమాధానం చెప్పింది.
Abbas : అమ్మాయి వదిలేసింది.. సూసైడ్ ప్రయత్నం.. సినిమాలు మానేశా.. ట్యాక్సీ డ్రైవర్‌గా..
ఇక నీ ప్రేమ కథ గురించి చెప్పమని అడుగగా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పింది ఈషా. ఆమె చెప్పిన మాటలతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. మరి వాళ్ల నాన్న ఎక్కడ అంటూ సుమ ప్రశ్నించింది. అంతటితో ప్రోమో పూర్తైంది. ఈషా రెబ్బా చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి కాకుండానే ఈషా తల్లయిందా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. తను ఎవరినైనా దత్తత తీసుకుందా..? పెంపుడు కుక్క పిల్లల గురించి చెప్పిందా..? అసలు నిజం ఏంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.
