ఈషా రెబ్బ.. ఈ పేరు చెబితే కొందరికి తెలియకపోవచ్చు.. అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ తో.. పెనిమిటీ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆ సినిమాతో ఈషా దశ తిరిగింది అని చెప్పొచ్చు. 30 ఏళ్ల ఈ బ్యూటీకి లేటుగా వచ్చిన సక్సెస్ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన తర్వాత మంచి మంచి ఆఫర్స్ కొట్టేస్తోంది. కొత్త సినిమాకి సైన్ చేసింది.
అది హర్రర్ మూవీ. ఓ మంచి కాఫీ లాంటి.. సాఫ్ట్, లవ్ లీ క్యారెక్టర్ కనిపించిన బ్యూటీ ఒక్కసారిగా దెయ్యం మూవీలో నటించటం విశేషం. ఇలాంటి క్యారెక్టర్ చేయటానికి గట్స్ ఉండాలి అంటున్నారు.
ఈ మూవీకి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్. నాగ్ తో ఢమరుకం తీశారు. ఆ సినిమా కూడా దేవుడు – దెయ్యం స్టోరీ అంతర్లీనంగా ఉంటుంది. మళ్లీ అలాంటి సబ్జెక్ట్ తోనే హర్రర్ థ్రిల్లర్ కథతో ట్రై చేస్తున్నారు. దీనికి ఈషాను సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మూవీపై హైప్ క్రియేట్ చేశారు అని చెప్పారు. అంతకు ముందు ఆ తరువాత మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అచ్చ తెలుగు బ్యూటీ. ఈ మూవీ హిట్ కొట్టాలని ఆల్ ద బెస్ట్..