OG Title: ఏంటి.. ఓజీ పవన్ కళ్యాణ్ టైటిల్ కాదా.. మరి ఎవరికోసం అనుకున్నారు?

బాక్సాఫీస్ దగ్గర ఓజీ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. (OG Title)దాదాపు పన్నెండేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నుంచి బ్లాక్ బస్టర్ రావడంతో ఆడియన్స్, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

OG Title: ఏంటి.. ఓజీ పవన్ కళ్యాణ్ టైటిల్ కాదా.. మరి ఎవరికోసం అనుకున్నారు?

Producer DVV Danayya makes interesting comments on the title of OG

Updated On : September 25, 2025 / 6:14 PM IST

OG Title: బాక్సాఫీస్ దగ్గర ఓజీ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దాదాపు పన్నెండేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నుంచి బ్లాక్ బస్టర్ రావడంతో ఆడియన్స్, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ను అలా యాక్షన్ మోడ్ లో చూసి ఎమోషనల్ అవుతున్నారు. సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన ఫెవరేట్ హీరోని ఎలా చుద్దలంటుకుంటున్నామో అలా చూపించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. కేవలం ప్రీ సేల్స్ తోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

OG Success Meet: ఇది మా పన్నెండేళ్ల కల.. కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది.. తమన్ క్రేజీ కామెంట్స్

ఇక ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో(OG Title) నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ఓజీ టైటిల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నిజానికి ఓజీ (దే కాల్ హిమ్ ఓజీ, ఓజాస్ గంభీర, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనేది చాలా చాలా పవర్ ఫుల్ టైటిల్. ఒక్కసారి వినగానే జనాల్లోకి అలా చొచ్చుకుపోయింది. అందుకే, సినిమా విజయంలో టైటిల్ కూడా కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. అయితే, ఈ టైటిల్ ముందు నాగ వంశీ రిజిస్టర్ చేయించుకున్నాడట. కానీ, ఈ కథకు ఓజీ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకుని నిర్మాత వెళ్లి అడగగా వెంటనే ఇచ్చేశాడట నాగ వంశీ. ఇక నాగ వంశీకి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టంమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అడగగానే ఒకే చెప్పేశాడట. ఆ విషయంలో నాగ వంశీకి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు దానయ్య.

ఇదిలా ఉంటే, అసలు నాగ వంశీ ఓజీ అనే టైటిల్ ను ఎవరికోసం, ఏ కథ కోసం రిజిస్టర్ చేయించాడు అనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ మధ్య ఎన్టీఆర్ హీరోగా జైలర్ దర్శకుడు నెల్సన్ తో ఒక మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని ప్లాన్ చేశాడు నాగ వంశీ. ఆ సినిమా కోసమే ఈ టైటిల్ ను అనుకున్నారట. కానీ, ఆ ప్రాజెక్టు లేట్ అవుతుండటంతో టైటిల్ ను సాక్రిఫైజ్ చేశాడట నాగ వంశీ. అలా ఎన్టీఆర్ కోసం అనుకున్న ఓజీ అనే పవర్ ఫుల్ టైటిల్ పవన్ కళ్యాణ్ కి పడింది.