OG Success Meet: ఇది మా పన్నెండేళ్ల కల.. కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది.. తమన్ క్రేజీ కామెంట్స్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది(OG Success Meet). సెప్టెంబర్ 24 నుంచే ఈ సినిమా ప్రీమియన్స్ టెలికాస్ట్ అయ్యాయి.

OG Success Meet: ఇది మా పన్నెండేళ్ల కల.. కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది.. తమన్ క్రేజీ కామెంట్స్

Thaman crazy comments at the OG Success Meet

Updated On : September 25, 2025 / 4:34 PM IST

OG Success Meet: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఓజీ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 24 నుంచే ఈ సినిమా ప్రీమియన్స్ టెలికాస్ట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేడంతో సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ (OG Success Meet)విజయాన్ని సాధించింది ఓజీ. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిక్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

OG Success Meet: ఇంకా నమ్మలేకపోతున్నా.. పవన్ కళ్యాణ్ ని జస్ట్ చూస్తే చాలనుకున్నా.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్

ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అప్పుడప్పుడు కొంచం బ్లాంక్ అవుతాం. ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇప్పుడు అదే సిచువేషన్ లో ఉన్నాం అందరం. విడుదలకు ముందు కాన్ఫిడెంట్ గానే ఉంటాం. కానీ, సక్సెస్ తరువాత ఒక భయం ఏర్పడుతుంది. ఇంకా జాగ్రత్తగా వర్క్ చేయాలనీ. నిజానికి ఓజీ సినిమా మా సినిమా కాదు. ఈ సినిమాను ఎప్పుడో ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. మా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్ అది. ఆ భయమే ఇంకా బాగా వర్క్ చేసేలా చేసింది. కేవలం అభిమానుల అంచనాలను అందుకోవడానికి మాత్రమే పని చేశాం. సుజీత్ తో రెండేళ్ల ప్రయాణం.

కథ చెప్పినప్పుడే చెప్పేశాను ఈ సినిమా చరిత్ర అవుతుంది అని. ఖుషిలో చిన్న కటనా ఫైట్ కే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు సినిమా మొత్తం అదే బ్యాక్డ్రాప్ లో అంటే సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే ఫిక్స్ అయ్యాను. ఇక ఓజీ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంతా త్రివిక్రమ్ గారే. ఆయన వల్లే ఓజీ మీ ముందుకు వచ్చింది. వంద సినిమాల తరువాత పవన్ గారితో పని చేసే అవకాశం వచ్చింది. పాలిటిక్స్ లో 21 స్థానాలు గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.