Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కు షాకిచ్చిన IRS అధికారి.. రూ.2 కోట్ల పరువునష్టం కేసు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి IRS అధికారి షాక్ ఇచ్చారు. తనపై మోసపూరిత,(Shah Rukh Khan) పరువుకు భంగం కలిగే కామెంట్స్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ కు షాకిచ్చిన IRS అధికారి.. రూ.2 కోట్ల పరువునష్టం కేసు

IRS officer Sameer Wankhede files Rs 2 crore defamation suit against Shah Rukh Khan

Updated On : September 25, 2025 / 7:47 PM IST

Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి IRS అధికారి షాక్ ఇచ్చారు. తనపై మోసపూరిత, పరువుకు భంగం కలిగే కామెంట్స్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది “బాడ్స్ ఆఫ్ బాలీవుడ్” వెబ్ సిరీస్‌ రూపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో తనపై తప్పుడు కంటెంట్ చూపించారణి ఆరోపణ చేసిన IRS అధికారి సమీర్ వాంఖేడే షారుఖ్ ఖాన్, గౌరి ఖాన్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, నెట్ ఫ్లిక్స్ పై ఫిర్యాదు చేశారు.

Sujeeth Cinematic Universe: ఓజీ యూనివర్స్ లోకి ప్రభాస్.. టైం ఫిక్స్ చేసిన సుజీత్

ఈ సిరీస్ మద్యపాన వ్యతిరేక ఏజెన్సీలపై తప్పుగా చిత్రీకరించారని, దానివల్ల ప్రజలలో నమ్మకం పోయే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అలాగే సిరీస్ లో సత్యమేవ జయతే నినాదం చేసే పాత్ర మిడిల్ ఫింగర్ చూపించి అశ్లీలతను ప్రదర్శించిందని, ఇది చట్ట ఉల్లంఘన అవుతుందని వాంఖేడే అన్నారు. ఈ సిరీస్ IT యాక్ట్, BNS చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అందుకే వారిపై పిటీషన్ దాఖలు చేశానని, పరువు నష్టం సొమ్మును టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి దానం చేస్తానని వాంఖేడే స్పష్టం చేశారు.