హౌస్ ఫుల్ 4 – ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్

‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 30, 2019 / 09:03 AM IST
హౌస్ ఫుల్ 4 – ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్

‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్..

‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌.. ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు.

ఇటీవల రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్‌కి, ట్రైలర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సోహైల్ సేన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సమీర్ అంజాన్ లిరిక్స్ రాశారు. సోహైల్ సేన్, అల్తామస్ ఫరీదీ, జ్యోతిక టంగ్రీ పాడగా.. ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌ను భారీగా పిక్చరైజ్ చేశారు.

Read Also : ముచ్చటగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడుగా!

అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’.. అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.