Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?

బిగ్‌బాస్‌ ఈ సీజన్‌ ఒక వారం కార్యక్రమంతో పాటు తొలి వారమే షోలో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపే కార్యక్రమం కూడా పూర్తి చేశారు. సోషల్‌ మీడియాలో చర్చ జరిగినట్లుగానే

Big Boss 5: బిగ్‌బాస్‌ ఈ సీజన్‌ ఒక వారం కార్యక్రమంతో పాటు తొలి వారమే షోలో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపే కార్యక్రమం కూడా పూర్తి చేశారు. సోషల్‌ మీడియాలో చర్చ జరిగినట్లుగానే.. ఒక విధంగా ముందే లీకైనట్లుగానే 7 ఆర్ట్స్‌ సరయూ ఎలిమినేట్‌ అయింది. దీంతో హౌస్‌ అంతా కాసేపు ఉద్విగ్న వాతావారణం నెలకొనగా మొత్తానికి సరయూను నాగ్ స్టేజ్ మీదకి తీసుకొచ్చేశాడు. అయితే ఫైర్ బ్రాండ్ గా పేరున్న సరయూ స్టేజీ మీదకు వచ్చిన అనంతరం ఒక్కో కంటెస్టెంట్‌కు పేరు పేరునా డోస్ ఇచ్చిపడేసింది.

Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!

అయితే.. అసలు సరయు ఎలిమినేషన్ వెనుక ఉన్న కారణం ఏంటి.. నిజంగానే సరయు ఎలిమినేషన్ బిగ్ బాస్ షో అభిమానులు కోరుకున్నదేనా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి హౌస్ లో ఉన్న ఒకరిద్దరి కంటెస్టెంట్ల కన్నా కూడా సరయూకి బయట బెటర్ ఫాలోయింగ్ ఉంది. అయినా వాళ్ళు ఇంట్లోనే ఉన్నా సరయూ బయటకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడే బయట ఆడియన్స్ పోల్స్ తో పాటు ఇంట్లో గేమ్ కూడా చాలా ముఖ్యం. సానుభూతి, ఎంటర్ టైన్మెంట్, ఫాలోయింగ్ ఇలా చాలా కారణాలతో ఈ ఎలిమినేషన్ జరుగుతుంది.

Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!

మిగతా హౌస్ మేట్స్ తో సరయూకున్న వాతావరణమే ముందు ఆమెని ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి తీసుకెళ్లేలా చేసింది. ఫస్ట్ వీక్ ఓపెన్ నామినేషన్స్ పెట్టినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మన చేతుల్లో లేని పని. సరయుని నామినేట్ చేసింది మొత్తం ముగ్గురు. వాళ్లలో విజె సన్నీ, మానస్, కాజల్ ఉండగా.. ఈ ముగ్గురి వల్లే సరయు ఎలిమినేట్ అయ్యిందనే చెప్పాలి. ఇందులో ఒకరు తగ్గినా కూడా సరయూ నామినేషన్స్ లో ఉండేదే కాదు. కానీ.. హౌస్ లోకి వెళ్లిన రోజు నుండే సరయూ ఆటిట్యూడ్ తో వాళ్ళు తనని ఎలిమినేషన్ కి నామినేట్ చేసేలా మాట్లాడడమే సరయూ కొంపముంచగా ఆ తర్వాత ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సానుభూతితో ఓట్లు గెలుచుకుంటే సరయూ వెనకబడి హౌస్ నుండి బయటపడాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు