×
Ad

Bigg Boss 9 Telugu: కప్పు గెలవలేదు అంతే.. విన్నర్ కి ఈక్వల్ గా ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu)లో 15 వారలు ఉన్న ఇమ్మాన్యుయేల్ విన్నర్ ఈక్వల్ గా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నాడట.

Emmanuel received a huge remuneration for Bigg Boss Season 9

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియబోతుంది. ఆ క్షణం కోసం చాలా మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టాప్ 2 కూడా సెట్ అయిపోయింది. తనూజ, కళ్యాణ్ మధ్య గట్టి పోటీ నడిచింది. కానీ, వార్ మాత్రం వన్ సైడ్ అయిపొయింది అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చి నాగార్జున చెప్పడం మాత్రమే మిగిలిపోయింది. అయితే, ఓపక్క బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu)విన్నర్ ఎవరు అనే చర్చ నడుస్తూ ఉంటే, మరోపక్క ఇమ్మాన్యుయేల్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. విన్నర్ అవ్వాల్సిన ఇమ్మాన్యుయేల్ కనీసం టాప్ 3లో కూడా లేకుండా ఎలిమినేట్ అయ్యాడు అంటూ బాధపడుతున్నారు.

Peddi: పెద్ది షూటింగ్ నుంచి ఫోటోస్ లీక్ .. వైరల్ అవుతున్న రామ్ చరణ్ మాసీ లుక్

అయితే, కేవలం గెలువలేదనే మాటే తప్పా రెమ్యునరేషన్ లో మాత్రం విన్నర్ గా ఈక్వల్ గా తీసుకున్నాడట ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు వారానికి రూ.2.25 లక్షల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఇమ్మాన్యుయేల్. మొత్తంగా 15 వారాల పాటు అతను ఆడియన్స్ ను తన ఆటతో ఆకట్టుకున్నాడు. కాబట్టి, 15 వారాలకు గాను మొత్తంగా రూ.34 లక్షల వరకు రెమ్యునరేషన్ గా సంపాదించాడట ఇమ్మాన్యుయేల్. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. బిగ్ బాస్ విన్నర్ కి ఇస్తున్న ప్రైజ్ మనీ రూ.50 లక్షలుగా అనౌన్స్ చేశాడు నాగార్జున.

ఆలెక్కన చూసుకుంటే విన్నర్ కి ఏమాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ విషయంలో అతను హ్యాపీ అనే చెప్పాలి. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పుడు ఇమ్మాన్యుయేల్ విన్నర్ అని చాలా మంది అనుకున్నారు. తన కామెడీ సెన్స్ తో చాలా ఎంటర్టైన్ చేశాడు. కానీ, రాను రాను ఆ కామెడీకి దూరం అవుతూ వచ్చాడు. ఆలాగే గేమ్ కి కూడా దూరం అయ్యాడు. అది ఆడియన్స్ కి నచ్చలేదు. అందుకే, ఇమ్మాన్యుయేల్ కి తక్కువగా వోటింగ్ పడింది అనే చెప్పాలి. ఎలాగైతేనేం విన్నర్ కి తగ్గట్టుగా భారీగా రెమ్యునరేషన్ సంపాదించాడు ఇమ్మాన్యుయేల్.