Peddi: పెద్ది షూటింగ్ నుంచి ఫోటోస్ లీక్ .. వైరల్ అవుతున్న రామ్ చరణ్ మాసీ లుక్
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా 'పెద్ది(Peddi)'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
Ram Charan Peddi movie shooting present happening at Rashtrapati Bhavan in Delhi.
Peddi: ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదలైన చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సంపాదించి, ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్స్డ్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే, పెద్ది(Peddi) సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ ముందు రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. తాజాగా ఈ లొకేషన్ నుంచి రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. చేతిలో సంచితో మాస్ లుక్ లో రామ్ చరణ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క ఫోటో పెద్ది సినిమాపై అంచనాలను డబుల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూరు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, పలువురు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పెద్ది సినిమా ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది చూడాలి.

