Priyanka Chopra: వెయ్యి కోట్లకు మించి.. వారణాసి బడ్జెట్ ఎంతో చెప్పిన ప్రియాంక చోప్రా.. అసలు ఏం ప్లాన్ చేశావ్ జక్కన్నా..
రాజమౌళి-మహేష్ బాబు వారణాసి సినిమా బడ్జెట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra).
Priyanka Chopra reveals the budget of Mahesh Babu- Rajamouli Varanasi movie
Priyanka Chopra: ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి ‘వారణాసి’ అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. భారతీయ ఇతిహాసమైన రామాయణం కథ ఆధారంగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సైతం వారణాసి సినిమాపై కామెంట్స్ చేయడం ట్రెండ్ అయ్యింది.
గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ తరువాత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వారణాసి కోసం మేకర్స్ రూ.1300 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పింది. దీంతో, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ లో మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. కారణం ఏంటంటే, వారణాసి సినిమా మొదలైనప్పుడు ఈ సినిమా కోసం మేకర్స్ రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినట్టుగా వార్తలు వినిపించాయి.
దానికే, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఇండియా నుంచి వస్తున్న ఒక సినిమా కోసం ఏకంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయడమా అంటూ చాలా మంది స్టార్ మేకర్స్ ముక్కున వేలేసుకున్నారు. మరి ఆ రేంజ్ మార్కెట్ అవుతుందా, అది ఎలా పాజిబుల్ అంటూ కామెంట్స్ చేశారు. కానీ, ఇప్పుడు రూ.1000 కోట్లు కాదు రూ.1300 కోట్లు అని తెలిసి అవాక్కవుతున్నారు. ఇదంతా కేవలం రాజమౌళి అనే పేరువల్ల సాధ్యం అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, రూ.1300 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారా అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు జక్కన్నా అంటూ కూడా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వారణాసి సినిమా విడుదల తరువాత ఇంకెంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
