OG Sequel: ‘ఓజీ సీక్వెల్’ నుంచి తప్పుకున్న DVV సంస్థ.. కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళే.. కారణం ఏంటో తెలుసా..?
ఓజీ సినిమా సీక్వెల్(OG Sequel) నుంచి నిర్మాతలు తప్పుకున్నారట. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. కానీ, సీక్వెల్ కి మాత్రం ఆయన నిర్మాతగా ఉండటం లేదట.
Producer DVV Danayya left from Pawan Kalyan OG movie sequel
OG Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కి రుచి చూపించిన సినిమా ఓజీ. చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారా సరిగ్గా అలాంటి సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశాడు దర్శకుడు సుజీత్. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఫిదా చేసింది. రీజనల మూవీగా వచ్చిన ఈ సినిమా మొదటిరోజే ఏకంగా రూ.154 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Sravanthi Chokarapu: పూబంతుల అందాలతో యాంకర్ స్రవంతి.. హాట్ అండ్ క్యూట్ ఫోటోలు
ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ కూడా ఉంటాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఆ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, ఓజీ సినిమా సీక్వెల్ నుంచి నిర్మాతలు తప్పుకున్నారట. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. కానీ, సీక్వెల్(OG Sequel) కి మాత్రం ఆయన నిర్మాతగా ఉండటం లేదట. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థానంలో యూవీ క్రియేషన్స్ వచ్చారట.
దర్శకుడు సుజీత్ గత రెండు సినిమాలు కూడా యువీ క్రియేషన్స్ లో చేసిన విషయం తెలిసిందే. వాటిలో రన్ రాజా రన్, సాహూ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు సుజీత్. అయితే, ఓజీ సినిమాకు సీక్వెల్ కోసం నిర్మాతలు మారడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, దానికి కారణం ఏంటా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న చాలా సినిమాల సీక్వెల్స్ కి నిర్మాతలు మారుతున్నారు. రీసెంట్ గా విడుదలైన అఖండ 2కి కూడా నిర్మాతలు మారారు. అలాగే, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న జై హనుమాన్ సినిమా సీక్వెల్ కి కూడా నిర్మాతలు మారారు. ఇప్పుడు మరోసారి ఓజీ సినిమా కోసం కూడా నిర్మాతలు మారుతున్నాయి. మరి ఈ మార్పుకు కారణాలు తెలియాల్సి ఉంది.
